కరీంనగర్ కార్పొరేషన్, మే 20 : కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, కుల వృత్తులకు జీవం పోసింది ఆయనేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం మంత్రి మీసేవా కార్యాలయంలో రజక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపి మంత్రి గంగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి, వంటి కులాల వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. విధి విధానాల రూపకల్పన కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు మైఖేల్ శ్రీనివాస్, పూసల శ్రీకాంత్, మారెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య, దుడ్డెల ప్రశాంత్ కుమార్, పూసాల సంపత్ కుమార్, అంతగిరి ఆంజనేయులు, ప్రేమ్ కుమార్, కొండ శ్రీనివాస్, నరేష్, నేరెళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
తమ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయటంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సాయంత్రం కేసీఆర్ సర్యూట్ హౌస్‌లో వీఆర్ఏలు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది, కరీంనగర్ జిల్లాలో 700 మంది లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. ఇక్కడ జేఏసీ జిల్లా కన్వీనర్ నలువాల మల్లేశం, చైర్మన్ కిన్నెర కొమరయ్య, జనరల్ సెక్రెటరీ చెట్టి రవి, ట్రెజరర్ పూరెల్ల మధు, కన్వీనర్ నలువాల సాయి కిశోర్, కో కన్వీనర్ ట్రెసా యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పడిగెల రాజ్ కుమార్, కరీంనగర్ జిల్లా ట్రెస్సా అధ్యక్షుడు నల్లా వెంకట్ రెడ్డి, ట్రెస్సా జనరల్ సెక్రెటరీ విజయ్, కరీంనగర్ అర్బన్, రూరల్ తహసీల్దార్లు సుధాకర్, నారాయణ ఉన్నారు.