కార్పొరేషన్, జూన్ 10: స్వరాష్ట్రంలోనే కరీంనగర్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర బీసీ సంక్షే మ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరానికి కొత్తందాలు తేనున్న కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 21న పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మూడురోజుల పాటు అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. శనివారం మంత్రి స్థానిక కేసీఆర్ హౌస్‌లో విలేకరులతో మా ట్లాడారు. దక్షిణ భారత్‌లోనే తొలి కేబుల్ బ్రిడ్జిని చేపట్టామన్నారు. కేబుల్ బ్రిడ్జిపై 10/30 అడుగుల స్రీన్లతో పాటుగా డైనమిక్ లైట్లను కూడా ఏ ర్పాటు చేశామన్నారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం త ర్వాత మానేరు రివర్ ఫ్రంట్ ప్రాంతంలో సా యంత్రం 7 గంటల నుంచి క్రాకర్, లేజర్‌షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పబ్లిక్అనౌన్స్మెంట్, ఫ్రీ వైఫై కేంద్రాలు, ట్రాఫిక్ సిగ్నిల్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. కేబుల్ బ్రిడ్జిపైకి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గం టల నుంచి 10 వరకు వాహనాలను అనుమతించకుండా నగరవాసులు ఆహ్లాదంగా గడిపేందుకు వీలు గా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో కరీంనగర్ గొప్ప నగరంగా రూపుదిద్దుకున్నదని స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్‌కు రావాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని డివిజన్లల్లో నూ వేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతు న్న మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశను ఆగస్టు 15న ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే మూ డోదైనా బిగ్ పౌంటెయిన్ను రూ.72 కోట్లతో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొదటి దశలో ఎంట్రన్స్ ప్లాజ, పౌంటెయిన్తో పాటు ఇతర ప నులను పూర్తి చేస్తామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఈ దిశగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నగరంలో ఈ ఆగస్టు నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు సంబంధించి తాత్కాలికంగా నిర్వహించే తరగతి గదుల కు అన్ని పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ వై సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కార్పొరేటర్ బండారి వేణు, నాయకుల పిట్టల రవీందర్, దూలం సంపత్, రేణుక, రాధిక తదితరులు పాల్గొన్నారు.