e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home కరీంనగర్ ఎమ్మెల్సీ ఓటర్లు @ 1,324

ఎమ్మెల్సీ ఓటర్లు @ 1,324

  • మహిళలే అత్యధికంగా 743
  • పురుషులు 581 మంది
  • పోలింగ్‌ కేంద్రాల వారీగా జాబితా విడుదల చేసిన అధికారులు

కరీంనగర్‌, నవంబర్‌ 25(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదలైంది. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని జడ్పీ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌అఫీషియో ఓటర్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్లు ఇలా ఉన్నారు.

కరీంనగర్‌లో ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రం పరిధిలో 94 మంది పురుషులు, 111 మంది మహిళల చొప్పున 205 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నలుగురు ఎక్స్‌అఫీషియో ఓటర్లు ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా పరిధిలోని హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రం పరిధిలో 83 మంది పురుషులు, 97 మంది మహిళల చొప్పున 180 మంది ఓటర్లు ఉన్నారు.

- Advertisement -

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం పరిధిలో 96 మంది పురుషులు, 124 మంది మహిళల చొప్పున 220 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎక్స్‌ అఫీషియో ఓటర్లు ఉన్నారు. ఇదే జిల్లా కోరుట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం పరిధిలో 62 మంది పురుషులు, 84 మంది మహిళల చొప్పున 146 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక్కరు ఎక్స్‌ అఫీషియో ఓటరు ఉన్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో 94 మంది పురుషులు, 114 మంది మహిళల చొప్పున 208 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు ఎక్స్‌ అఫీషియో ఓటర్లు ఉన్నారు. ఇదే జిల్లా మంథని పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం పరిధిలో 39 మంది పురుషులు, 59 మంది మహిళల చొప్పున 98 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక్కరు ఎక్స్‌ అఫీషియో ఓటరు ఉన్నారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో 88 మంది పురుషులు, 113 మంది మహిళల చొప్పున 201 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు ఎక్స్‌ అఫీషియో ఓటర్లు ఉన్నారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన మరో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 25 మంది పురుషులు, 41 మంది మహిళల చొప్పున 66 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక్కరు ఎక్స్‌ అఫీషియో ఓటరు ఉన్నారు.

ఓటరు జాబితాలో మున్సిపల్‌ కార్పొరేటర్లలో 49 మంది పురుషులు, 60 మంది మహిళల చొప్పున 109 మంది, మున్సిపల్‌ కౌన్సిలర్లలో 164 మంది పురుషులులు 205 మంది మహిళల చొప్పున 369 మంది, జడ్పీటీసీ సభ్యుల్లో 31 మంది పురుషులు, 39 మంది మహిళల చొప్పున 70 మంది, ఎంపీటీసీ సభ్యుల్లో 323 మంది పురుషులు, 439 మంది మహిళల చొప్పున 762 మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement