10 కోట్లతో ఉడాయించిన ఉపాధ్యాయుడు!
ప్రభుత్వ ఉపాధ్యాయుడు పది కోట్లు అప్పుగా తీసుకుని కుటుంబంతో ఉడాయించిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో వెలుగుచూసింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ రాజు.. శెట్టిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే మండలం హున్యా తండాకు చెందిన బాణోతు నాగేందర్‌తోపాటు మరికొందరి వద్ద లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
- సూర్యాపేట జిల్లా లక్ష్మీనాయక్ తండాలో ఘటన
- చివ్వెంల పీఎస్‌లో ఫిర్యాదు
చివ్వెంల, సెప్టెంబర్ 26 : ప్రభుత్వ ఉపాధ్యాయుడు పది కోట్లు అప్పుగా తీసుకుని కుటుంబంతో ఉడాయించిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో వెలుగుచూసింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ రాజు.. శెట్టిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే మండలం హున్యా తండాకు చెందిన బాణోతు నాగేందర్‌తోపాటు మరికొందరి వద్ద లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడినని, లోన్‌కు దరఖాస్తు చేశానని, లోన్ రాగానే డబ్బులు ఇస్తానని చెప్పినట్టు బాధితులు పేర్కొన్నారు.
‘నా పేరిట ఉన్న ఆస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన. మీరిప్పుడు మమ్మల్ని ఏమీ చేయలేరు’ అని రాజుతోపాటు అతని భార్య తమను బెదిరించేవారని వారు పేర్కొన్నారు. వారం రోజులుగా వారు గ్రామంలో కనిపించకుండా పోయారని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. రాజుతోపాటు అతని భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని ఎస్పీ నరసింహతోపాటు చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కే సు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్సై మహేశ్వర్ తెలిపారు. టీ చర్ రాజు సుమారు రూ. 10 కోట్లతో ఉడాయించాడంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది. కాగా రూ.కోటి చొప్పున అప్పుగా ఇచ్చిన బాధితులు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

