తిమ్మాపూర్, మే1: రైతులు వరి ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే.. దాన్ని అమ్మేదాకా పడే తిప్పల మరో ఎత్తు ఉంటుంది. వడ్లు ఎంత బాగున్నా మిల్లర్ల పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కోతల పేరుతో రైతులను నష్టాలకు గురి చేస్తున్నారు. అయితే దీనికి అధికారులు స్వస్తి పలికేందుకు ఆటోమేటిక్ పాడీ క్లీనర్స్ ఏర్పాటు చేశారు. గతంలో వడ్లను తూర్పారబట్టేందుకు యంత్రాలు ఉన్నప్పటికి దానికి కూలీల ఖర్చు ఎక్కువవుతుంది.
దీంతో అధికారులు రామకృష్ణ కాలనీలోని కొనుగోలు కేంద్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త యంత్రంతో కూలీల ఖర్చే ఉండదు అని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ధాన్యం రాశి నుండి నేరుగా యంత్రం తీసుకొని మలినాలను వేరుచేసి నాణ్యమైన ధాన్యాన్ని కుప్పగా చేర్చుతాయి. సెంటర్ లో మిషన్ పెట్టడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని బాధ్యతలను సెంటర్ ఇంచార్జీలకు అప్పగించారు.