Government schools | ఇల్లందకుంట, జూన్ 12 : బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం పిల్లలకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాలతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.