Sultanabad | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 24 : గత కొన్ని రోజులుగా శుభకార్యాలు, తదితర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రజలకు శుభకార్యాలకు విరమం వచ్చిందని అర్చకులు కాండూరి వాసు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామానికి చెందిన అర్చకులు కాండూరి వాసు సోమవారం మాట్లాడుతూ శుక్ర మౌడ్యమి (మూఢం) ఉన్నందున 83రోజుల పాటు శుభకార్యాలు లేవన్నారు. ఈనెల 26 నుండి ఫిబ్రవరి 17వరకు శుక్ర మౌడ్యమి(మూఢం) ఉన్నందువల్ల శుభకార్యాలు లేవని తెలిపారు.
శుభాలకు అధిపతి అయిన గురు, శుక్రుడు ఈ మూడాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తి కోల్పోతాయని వివరించారు. ఈ రోజులలో వివాహాలు, గృహప్రవేశాలు, బోర్లు తవ్వించడం, పుట్టు వెంట్రుకలు తీయడం, ఎంగేజ్మెంట్లు చేయడం లాంటివి చేయకూడదన్నారు. నిత్య ఆరాధన ,సీమంతాలకు ఈ దోషం వర్తించదన్నారు. ఈ విషయాలను సర్వజనాలు పాటించాలని సూచించారు. ఫంక్షన్ హాల్స్, టెంటు షాపు యజమానులు, వారి దగ్గర పని చేసే వర్కర్స్ కు ఈ వ్యవస్థ పై ఆధారపడ్డ వారికి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాండూరి వాసు అభిప్రాయం వ్యక్తం చేశారు.