Industrial park | రామగిరి, ఆగస్ట్ 20 : రామగిరి మండలం రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారు లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూశాఖ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడి పాట్టడారులైన రైతుల ఇండ్లకు బుధవారం నోటీసులు అటించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామగిరి మండలంలోని రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారులో ప్రతి పాదిత ఇండస్ర్టీయల్ పార్క్ కోసం గ్రామ రైతుల పంట భూములను ప్రభుత్వానికి స్వాధీనపర్చాలని రెవెన్యూ అధికారులు ఈ నెల 1న అభిప్రాయ సేకరణలో కోరగా, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.
అయితే, రైతుల నిరాకరణ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రామగిరి రెవెన్యూ సిబ్బంది చర్యలు బుధవారం ప్రారంభించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం స్వాధీనం ప్రక్రియను కొనసాగిస్తూ రత్నాపూర్ గ్రామంలోని రైతుల ఇళ్లకు నోటీసులు అట్టించారు. ఈ పరిణామంతో గ్రామంలో రైతుల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. తమ పంట భూములను కోల్పోతే జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ర్టీయల్ పార్క్ కోసం భూముల స్వాధీనంపై రైతులు మరింతగా నిరసనకు దిగుతమని పేర్కొన్నారు.
ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు 203 ఎకరాల భూములు అవసరం కాగా ఇందులో 145 ఎకరాలు రత్నపూర్ కు చెందిన 120మందికి చెందినవే ఉన్నవని, కంపెనీ ఏర్పాటులో మా భూములు తీసుకోవద్దని వారు సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.