Nomination Centers | కోల్ సిటీ, జనవరి 27 : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి 31వరకు ఆయా డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను సిద్ధం చేశారు.
బుధవారం ఉదయం నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. కాగా రామగుండం కార్పొరేషన్ విస్తరించి ఉన్న రామగుండం, గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 60 డివిజన్లకు గానూ 36 మంది ఆర్.ఓలను నియమించారు. కాగా, నామినేషన్ పత్రాలు స్వీకరించేందుకు 8 కేంద్రాలను సిద్ధం చేశారు.
నామినేషన్ కేంద్రాలు
1.ముబారక్ నగర్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల
2.ఎన్టీపీసీ టెంపరరీ టౌన్ షిప్ లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల
3.గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల
4.గోదావరిఖని అశోక్ నగర్ లోని ఉర్దూ మీడియం పాఠశాల
5.గోదావరిఖని గాంధీనగర్ లో గల సింగరేణి ఆర్జీ 1 కమ్యూనిటీ హాలు
6.గోదావరిఖని జవహర్ నగర్లో గల జీవీటీసీ
7.గోదావరిఖని తిలక్ నగర్ డౌన్ లో గల స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం
8.యైటింక్లయిన్ కాలనీ పట్టణంలోని ఎన్సీవోఏ క్లబ్
పై కేంద్రాలలో అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. కాగా, కార్పొరేషన్ పరిధిలో మొత్తం 277 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.