కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 31 : నూతన సంవత్సరానికి జిల్లావాసులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం నుంచే సంబురాల్లో మునిగితేలారు. విందు వినోదాలతో గడిపారు. అర్ధరాత్రి 12గంటలు కాగానే ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 2024కు వీడ్కోలు పలుకుతూ, 2025ను స్వాగతించారు. కేక్‌లు కట్ చేసి నోళ్లు తీపి చేసుకున్నారు.
ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఇటు ఉదయం నుంచే విద్యాసంస్థల్లో కొత్త సంవత్సర వేడుకలను ముందస్తుగా జరుపుకొన్నారు. విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు. అల్ఫోర్స్‌లో విద్యాసంస్థల్లో చైర్మన్ వీ నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. అనంతరం అన్ని పాఠశాలల ప్రాంగణాల్లో కేక్‌లను కట్ చేశారు. అలాగే ట్రినిటీ కళాశాలల ప్రాంగణాల్లో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు.