జిల్లా వ్యాప్తంగా సోమవారం 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కేక్‌లు కోసి.. స్వీట్లు పంచిపెట్టారు సంబురాలు చేసుకున్నారు. ఉదయం నుంచే ఆలయాల్లో పూజలు చేశారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
ముస్తాబాద్/ ఇల్లంతకుంట, జనవరి 1 -వేములవాడ/ వేములవాడ రూరల్/ కోనరావుపేట/ రుద్రంగి/ బోయినపల్లి/ చందుర్తి/ సిరిసిల్ల రూరల్/ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్, ప్రొటోకాల్ పర్యవేక్షకుడు శ్రీరాములు ఆశీర్వదించారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోని బాప్టిస్ట్ చర్చిలో న్యూ ఇయర్ వేడుకలకు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ హాజరయ్యారు.
అనంతరం కేక్ కట్ చేసి విషెస్ చెప్పారు. ఇక్కడ ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచులు ఉన్నారు. అలాగే కోనరావుపేట మడలం సుద్దాలలోని చర్చి, రుద్రంగిలోని చర్చిలో విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేసి, కేక్ కట్ చేసి సంబురాల్లో పాల్గొన్నారు. తర్వాత రుద్రంగికి చెందిన నంద్యాడపు బుచ్చి మల్లయ్య, గడ్డం రాజవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో విప్, ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేశారు.
బోయినపల్లి మండలం కొదురుపాకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు తన నివాసంలో కేక్ కట్ చేశారు. వేడుకల్లో వైస్‌ఎంపీపీ నాగయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడి,్డ వైస్‌చైర్మన్ చికాల సుధాకర్‌రావు, కొండగట్టు ఆలయ డైరెక్టర్ ముద్దం రవి, నాయకులు ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు కేజీబీవీలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ హాజరై, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎస్వో పావని, ఉపాధ్యాయులు ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మండల ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షాలు తెలిపి స్వీట్లు తినిపించారు. ఇక్కడ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ బాపురావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, మాజీ సర్పంచ్ కృష్ణ, సెస్ సిబ్బంది పాల్గొన్నారు. చందుర్తి మండలం మూడపల్లిలో గల సువార్త ప్రార్థన మందిరంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయగా చిన్నారుల నాటక ప్రదర్శన ఆకట్టుకున్నది. దైవజనులు గోలి నర్సింహారెడ్డి బైబిల్ ప్రవచనాలను ఉపదేశించారు. ఇల్లంతకుంటలో ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి కేక్ కట్ చేశారు. మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, మాధవరెడ్డి, డైరెక్టర్లు సృజన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, రాజు, దేవేందర్‌రెడ్డి, రామకృష్ణ, కొమురయ్య తదితరులు ఉన్నారు.