దివ్యాంగులకు సర్కారు చేయూత
తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు చేయూతనందిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవానికి జడ్పీటీసీ రవీందర్‌తో కలిసి హాజరై మాట్లాడారు.
- పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి
- భవిత కేంద్రాల్లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం
చిగురుమామిడి, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు చేయూతనందిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవానికి జడ్పీటీసీ రవీందర్‌తో కలిసి హాజరై మాట్లాడారు. దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు శోభారాణి, రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు బొడ్డు తిరుపతి, భవిత బోధకులు తిరుపతి, మాధవి, సీఆర్పీలు ఆంజనేయులు, శ్రీనివాస్, వెంకటేశం, శ్రీవాణి పాల్గొన్నారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్, డిసెంబర్ 3: మానకొండూర్ ఎమ్మార్సీ ఆవరణలోని భవిత కేంద్రంలో శనివారం దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో ఎం మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎంఈవో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు సుజాత, ఉమారాణి, సీఆర్పీలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయురాలి ఉదారత
మానకొండూర్, డిసెంబర్ 3: మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు జయప్రదగౌతమి దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం భవిత కేంద్రంలోని చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు, అరటిపండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనసూయ, భవిత కేంద్రం ఉపాధ్యాయులు సుజాత, ఉమారాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎల్ఎండీ కాలనీలో..
తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 3: మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల భవిత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల ర్యాలీని సర్పంచ్ జక్కని శ్రీవాణి ప్రారంభించారు. దివ్యాంగుల సంరక్షణ గురించి భవిత ఇన్చార్జిలు రాపర్తి గణేశ్, పద్మ వివరించారు. పలువురు విద్యార్థులకు ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్ బహమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

