పెద్దపల్లి కమాన్, జూన్ 15 :వేసవి సెలవుల అనంతరం సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయితే, అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపకపోవడంతో మొదటిరోజు వెలవెలబోయాయి. సర్కారు బడులు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన 9.30 గంటల నుంచే కార్యక్రమాలు మొదలయ్యాయి. స్కూల్స్‌కు వచ్చిన విద్యార్థులు ఆవరణల్లో సందడి చేశారు. కొత్త తరగతి గదుల్లో కూర్చొని ఒకరినొకరు పలుకరించుకుంటూ సంబురపడ్డారు.