Odela | ఓదెల, జులై 10 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మల్లికార్జున ఆటో యూనియన్ నూతన కార్యవర్గంను శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చింతల పరశురామ్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా మంద రామకృష్ణ, క్యాషియర్ గా పసిడ్ల స్వామి, డైరెక్టర్లుగా తూడి కుమార్, శాంతాల కుమార్, పసిడ్ల సతీష్, సూరం మల్లికార్జున్, పోతుగంటి వెంకటేష్, నారెడ్ల కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ అభివృద్ధి కి మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.