Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 2 కె -రన్ పోటీలను నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు పరుగు పందెం నిర్వహించారు.
Dharmaram | ధర్మారం ,ఆగస్టు 29 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 2 కె -రన్ పోటీలను నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు క్లబ్ తరఫున బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చింతపండు నర్సింగం, డిస్ట్రిక్ట్ మైక్రో క్యాబినెట్ సభ్యులు సామ ఎల్లారెడ్డి, తన్నీరు రాజేందర్, డాక్టర్ కామన్ శ్రీనివాస్, మునీందర్ రెడ్డి, క్లబ్ ప్రధాన కార్యదర్శి కట్ట రమేష్, కోశాధికారి కడారి కుమార్, జెడ్ సి తలమక్కి రవీందర్ శెట్టి, సభ్యులు గడ్డం లింగారెడ్డి,ఇప్ప మల్లేష్, ,అక్కెనపల్లి చంద్రయ్య, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లి స్వామి, సభ్యులు దాగేటి కొమురయ్య,పీఎస్ రైటర్ సుందర్ సింగ్, నరేందర్, మోడల్ స్కూల్ పిఈటి బైకని కొమురయ్య, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
పత్తిపాకలో..
ధర్మారం మండలం పత్తిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్థానిక’యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు స్థానిక సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ సరిత, పీడీ విఠల్,యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కో-ఫౌండర్ ఆదర్శ్, అసోసియేషన్ సభ్యులు రాకేష్, నితిన్, ఇర్ఫాన్, రిషి, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

