National Handloom Day | ధర్మారం/గంగాధర, ఆగస్టు 7 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పవర్లూమ్ కార్మిక సంఘం అధ్యక్షుడు గాజంగి కొమురయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. తమ వృత్తి సంకేతాలైన చేనేత వస్త్ర సామగ్రి తయారీ పరికరాలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వృత్తికి తగిన ప్రోత్సాహం అందించి వస్త్ర పరిశ్రమను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా నాయకుడు, న్యాయవాది బోట్ల లక్ష్మీ నర్సయ్య ,సంఘం ధర్మారం పట్టణ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు డాక్టర్ కామని శ్రీనివాస్, నాయకులు సామల రాజయ్య, కుంట రాజు, గోనే దేవయ్య, దేవసాని సత్యనారాయణ, వివిధ గ్రామాల్లోని చేనేత కార్మికులు పాల్గొన్నారు.

ఓదెలలో..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించి పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను పలువురుని శాలువాలతో సన్మానం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను తీసుకురావాలని కోరారు. చేనేత వస్త్రాలకు ఆదరణ లభించేలా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు క్యాతం సత్యనారాయణ, ఊరకొండ రామస్వామి, వంగరి రమేష్, క్యాతం శంకరయ్య తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మెరుగు సారంగం, గౌరవ అధ్యక్షుడు భీష్మచారి, సంఘ నాయకులు క్యాతం వెంకటేశ్వర్లు, క్యాతం శ్రీనివాస్, రాజేందర్ ప్రసాద్, సదానందం, రవీందర్, తుమ్మ మధు, తాటికొండ సత్యం, మాటి సతీష్, దిడ్డి సిద్దు, అరకల నారాయణ, క్యాతం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

గర్షకుర్తిలో..
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో స్థానిక పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కూడాలిలోని నేతన్న విగ్రహానికి పద్మశాలీ నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిందం ఆంజనేయులు, వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ మాట్లాడారు. సమాజంలో నేతాకార్మికులు, పద్మశాలీల పాత్ర ఎంతో కీలకం అన్నారు. నేతన్న తయారు చేస్తున్న గుడ్డ ఉత్పత్తి ద్వారే ప్రతి వ్యక్తి వస్త్రధారణ ధరించగలుగుతున్నారని అన్నారు. వస్త్రోత్పత్తి వెనుక నేతన్న పడుతున్న శ్రమ విలువ కట్టలేనిదన్నారు. ప్రతీ యేటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ నేతన్న విలువలను గుర్తు చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి చిందం రాజమౌళి, గర్శకుర్తి గ్రామ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అలువాల రాజేశం, కోశాధికారి చిందం శేఖర్, పద్మశాలి సంఘం మండల నాయకులు చిప్ప చక్రపాణి, అలువాల తిరుపతి, అన్నల్ దాస్ వెంకటాద్రి, వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్, శ్రీనివాస్, ఉపాధ్యక్షలు గుండా రాజేశం, చిందం సత్యనారాయణ, కోశాధికారి బొల్లబత్తి నగేష్, గ్రామ కార్మిక సంఘం అధ్యక్షుడు అలువాల శ్రీశైలం, మాజీ అధ్యక్షుడు గడ్డం నారాయణతోపాటు పద్మశాలి సంఘం, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.