National Distinguished Award | కోరుట్ల, జూన్ 2 : కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహరావు పశు వైద్య కళాశాలలో శరీర ధర్మ శాస్త్ర విభాగాధిపతిగా సేవలందిస్తున్న డాక్టర్ రాథాకృష్ణ పులికంటి, డాక్టర్ వర్గీస్ కురియన్ జాతీయ విశిష్టత -2026 పురస్కారం అందుకున్నారు. ఇటీవల జంషెడ్ పూర్ కు చెందిన పశుధాన్ ప్రహరీ సంస్థ జాతీయ స్థాయిలో భారత శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ స్మారకార్ధం నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో రాధకృష్ణ విజేతగా నిలిచారు.
పాలు, వెటర్నరీ రంగాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన, సృజనాత్మక ఆలోచనలు, విశ్లేషణాత్మక దృష్టితో వ్యాసం రచించినందుకు గాను ఆయనకు జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి పురస్కారాన్ని అందజేశారు. పురస్కార గ్రహీతకు వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్తలు, ఆధ్యాపకులు అభినందనలు తెలిపారు.