National Camera Day | ధర్మపురి, జూన్ 29: ధర్మపురి ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ కెమెరా దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకులు గుండి అశ్విన్ శర్మ మంత్రోచ్ఛారణాల మధ్య కెమెరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీనియర్ ఫొటో గ్రాఫర్ వడ్లూరి రవీందర్ మట్టితో తయారు చేసిన ఛాయాచిత్ర యంత్ర దేవతకు ప్రత్యేక అర్చనలు, నివేదన, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. ప్రపంచ ఛాయాచిత్రకారుల సంక్షేమార్థం, లోకకల్యాణం కోసం ఛాయాచిత్ర దేవత పూజలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్లు ఉత్తం పెద్దన్న, కిషన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.