Ponnam Prabhakar | కమాన్ చౌరస్తా, మే 23: నీతి, నిజాయితీ, మంచి తనానికి మారు పేరు నేరేడ్ల శ్రీనివాస్ అని, ఆయన కరీంనగర్ ఫిలిం సొసైటీ లో సామాజిక ఉద్యమకారుడు అని లోక్ సత్తా ఉద్యమ నాయకుడిగా, సామాన్యుల, వినియోగదారుల పక్షాన ఆయన పోరాటం మరువలేనిదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నరేడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలింభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, రాష్ట్ర గురుకులాల సంయుక్త కార్యదర్శి శ్యాంప్రసాద్, శ్రీనివాస్ భార్య మధుమతి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఫిలింభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 1987 లో ఎస్సారార్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత శ్రీనివాస్‌తో ఏర్పడిన పరిచయం తన రాజకీయ ఎదుగుదలకు ఎంతో దోహదం చేశాయన్నారు. వినియోగదారుల పక్షాన, సమాచార హక్కు దారుడిగా పోరాడారు. ఫిలిం సొసైటీ లో కీలక సభ్యుడిగా ఆయన సేవలను కొనియాడారు. ఫిలిం సొసైటీ కి మంచి స్థలం సేకరిస్తే, భవణ నిర్మానానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ వరాల మహేష్, ప్రశాష్ హోల్లా, ఆర్వో రావు, కోల రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజఫర్, అన్నవరం దేవేందర్, డాక్టర్ రఘురాం, ఎన్ శ్రీనివాస్, లోక్ సత్తా, వినియోగదారుల మండలి సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.