Dharmaram | ధర్మారం, జనవరి31: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి సంగ రంజిత్, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మోట పలుకుల అశోక్, సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు.
అనంతరం జడ్జి సరిత సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా జడ్జిని సర్పంచ్, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద శాలువాతో సన్మానించారు. అమ్మవార్లు వెలిసిన జాతర ప్రదేశం వద్ద మామిడి తోట చుట్టూ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉందని భక్తుల సందర్శనకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జి వెంట న్యాయవాదులు బోట్ల లక్ష్మీ నర్సయ్య, ఆకారి రాజేశం, నూనె సత్యనారాయణ తదితరులు ఉన్నారు.