nandimedaaram | ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
ఈ మేరకు కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్లు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కమిటీని ఎన్నుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గడ్డం లింగారెడ్డి , వైస్ ప్రెసిడెంట్ గా భీసవేని మల్లీశ్వరి, జనరల్ సెక్రెటరీగా ఈదుల ప్రదీప్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా పురాణం సందీప్ కుమార్, ట్రెజరర్ గా ఆకారి రాజేశం, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా భీమారపు సంపత్, సీనియర్ ఈసీ మెంబర్లుగా నార అశోక్ రెడ్డి, బొట్ల లక్ష్మీ నర్సయ్య ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను తోటి న్యాయవాదులు సన్మానించి అభినందనలు తెలిపారు.