Vemulawada | వేములవాడ, మార్చి 10 : కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఏళ్లుగా గడప గడప తిరిగి పార్టీ బలోపేతానికి కష్టపడితే గడిచిన మున్సిపల్ ఎన్నికలలో గుర్తింపుని ఇవ్వకపోగా కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు నాగుల రాము గౌడ్ రాజీనామా లేఖను మంగళవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కు పంపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 20 ఏళ్లుగా పార్టీలో ఉంటూ సేవ చేస్తూ గడిచిన 10 సంవత్సరాలుగా గడపగడప తిరిగి పార్టీ కోసం కష్టపడ్డానని ఆవేదనతో వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల క్రితమే 27వ వార్డు కౌన్సిలర్ గా పోటీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో ప్రారంభించానని తెలిపారు. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా బంధుప్రీతితో పార్టీకి సంబంధం లేని వ్యక్తి కేవలం కాపు సామాజిక వర్గం అయినవారికి టికెట్ కేటాయించారని తెలిపారు. నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నానని రాముగౌడ్ వెల్లడించారు.