చిగురుమామిడి, జూలై 01: అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో అర్హులందరికి ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బుధవారం సిపిఐ నాయకులు చిగురుమామిడి మండల డిప్యూటీ తహశీల్దార్ కళావతి కి బుధవారం వినతి పత్రం అందజేశారు.
అర్హులైన వారికి న్యాయం జరిగే విధంగా చూడడం కోసం జిల్లా అధికారులకు తెలియజేస్తామని డిప్యూటీ తహశీల్దార్ కళావతి నాయకులకు హామీ ఇచ్చారు.
అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక, సొంత స్థలం కూడా లేకపోవడం, గ్రామాల్లోని ప్రభుత్వ భూములను అధికారులు గుర్తించి అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అర్హులైన పేదలకు న్యాయం జరగనిచో సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉద్యమాలు చేపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్న స్వామి, బోయిని వల్లభాయ్ పటేల్,మావురపు రాజు, మండల సహాయ కార్యదర్శులు బూడిద సదాశివ, పైడిపెల్లి వెంకటేష్, మండల కౌన్సిల్ సభ్యులు గోలీ బాపు రెడ్డి, ఎం.డి.ఉస్మాన్ పాషా, ఎలగందుల రాజు, మొగిలి ఓదెలు, తమ్మిశెట్టి రవీందర్, రాకం అంజవ్వ, అందె తిరుపతి, మహంకాళి రాములు, తాళ్ళపెల్లి చంద్రయ్య, అనువోజు జనార్ధన్, కయ్యం వీరయ్య, చెంచల రవి, బద్దం కొమురెల్లా రెడ్డి, నాయిని సురేష్, పీచు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.