Konduri Ravinder Rao | సిరిసిల్ల రూరల్, జూలై 11: సిరిసిల్ల నియోజకవర్గంలో న్యాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించారు.
ఈ మేరకు మండలంలోని మండే పల్లి శివారు లోని ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారి సమక్షంలోనే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కొండూరి రవీందర్ రావు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ ఏ యం సి చైర్మన్ సింగి రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ఉమ్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగు మామిడి వెంకట రమణారెడ్డి మాట్లా మధు, గణప శివజ్యోతి, బుస్స లింగం, గుగ్గిళ్ల అంజయ్య గౌడ్, అవునూరి వెంకట రాములు, కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నంద గిరి భాస్కర్ గౌడ్, బండి జగన్, ఏసీ రెడ్డి రాంరెడ్డి, సిలువేరు నర్సయ్య, సిలువేరి చిరంజీవి, ముత్యంరెడ్డి, కర్నె బాలయ్య, సాయిరాం, అమర్ రావు, అబు బఖర్, సదుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.