ముస్తాబాద్, జూన్ 9: పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని, పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ స్పష్టం చేశారు. మంగళవారం ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ, ఎస్ఐఆర్ ఓటర్ నమోదుపై శ్రేణులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. వీర్నపల్లి మండలం భూక్యాతండాతోపాటు ఎల్లారెడ్డిపేటలోనూ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల తుల ఉమ మాట్లాడారు.
ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు చేపడుతున్న సభ్యత్వ నమోదులో ముందుండాలని, పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను, ప్రస్తుత కాంగ్రెస్ వైఫల్యాలు, హామీల మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 13న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బూత్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
ముస్తాబాద్‌లో పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్‌రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడి,్డ మాజీ ఏఎంసీ చైర్మన్లు యాది మల్లేశ్ యాదవ్, భక్తుల అంజయ్య, శీలం జనాభాయ్, సర్పంచులు చిగురు నరేశ్, ఆంజనేయులు, సీనియర్ నాయకులు చెవుల మల్లేశ్ యాదవ్, నల్ల నరసయ్య, గూడూరు భరత్, సతీశ్, చందర్రావు, శీలం స్వామి, కొండ శ్రీనివాస్ గౌడ్, కుర్ర సావిత్రి, దబ్బెడ రేణుక, మింగని స్వర్ణలత పాల్గొన్నారు.