కరీంనగర్ : జిల్లాలోని హుజురాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ నుసం సుధాకర్ రెడ్డి( AE Sudhakar Reddy ) లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) కి పట్టుబడ్డాడు. పట్టణంలో నిర్మించిన స్ట్రోమ్ డైనేజీకి సంబంధించిన ఫైనల్ బిల్లు కోసం మెజర్మెంట్ బుక్‌లో నమోదు చేయాలని అధికారులను సంప్రదించాడు.
అయితే ఏఈ సుధాకర్‌రెడ్డి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేయగా బుధవారం హుజురాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేసి ,అరెస్టు చేశామని, అనంతరం కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు.