Korukanti Chander | అంతర్గాం, జులై 7: త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీకని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామంలో మొహర్రం సందర్భంగా సోమవారం పీర్లను దర్శించుకున్నారు.
హిందు ముస్లింలు కలసి ఎంతో ఘనంగా మొహర్రం పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు అయులయ్య యాదవ్, బోడ్డుపల్లి శ్రీనివాస్, ఆర్శనపల్లి శ్రీనివాస్, నిమ్మరాజుల రాజు, కొడి రామకృష్ణ పాల్గొన్నారు.