Telangana Mudiraj Maha Sabha | పెద్దపల్లి, నవంబర్ 15 : ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహా సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 21న తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకల పోస్టర్‌ను శనివారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి రూ.750 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వం రూ.3వేలు కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముదిరాజ్ కో ఆపరేటీవ్ సోసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. చెరువులు, కుంటలపై ముదిరాజ్ కలాలకు మాత్రమే హక్కు ఉండేలా చట్టపరమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు.
అభయ హస్తం -కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా బీసీలకు 42 శాతం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని, అందులో ముదిరాజ్‌ల జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న తెలంగాణ మహా సభ 11వ వార్షికోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురష్కరించుకోని పల్లె పండుగా సందర్భంగా ఊరూరా ముదిరాజ్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూతగడ్డ సంపత్, ముత్యాల రాజయ్య, నూనె పరమేశ్వర్, నర్సింహాం, అజయ్, శ్రీనివాస్, గట్టయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.