Mrityunjaya Homam | కోల్ సిటీ, ఆగస్టు 28 : రాఖీ (జంద్యాల) పూర్ణిమ పర్వదినం పురస్కరించుకొని లోక కల్యాణార్థం గోదావరిఖని మార్కండేయ కాలనీలో గల శ్రీ మార్కండేయ శివాలయం ఆవరణలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజున మార్కండేయుడి సన్నిధిలో జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు చిగురాల రాఘవాచార్యులు మంత్రోచ్ఛారణల మధ్య రక్షాబంధన, యజ్ఞోపవీత దారణ, గణపతి, నవగ్రహ, మార్కండేయ పూజలతోపాటు మృత్యుంజయ హోమంను అత్యంత వైభవంగా నిర్వహించారు.
పద్మశాలీ కులస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 47వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, వంగ వీరస్వామి, రాజమల్లు, గడ్డం జానకీరాం, కానుగంటి నారాయణ, పోరండ్ల కొమురయ్య, ఆర్ఎస్ మూర్తి, మాటేటి సతీష్, బొద్దుల వేణు, గడ్డం సత్యనారాయణ, అడిచర్ల నంబయ్య, గోసిక సత్యం, నాగేశ్వరరావుతోపాటు అధిక సంఖ్యలో పద్మశాలీలు పాల్గొన్నారు.