Sakhi | జగిత్యాల, సెప్టెంబర్ 6: జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన ఆనెగాళ్ల కిష్టమ్మ (75) అనే వృద్ద్దురాలిని ఆమె కుమారుడు తిరుపతి, కోడలు పద్మ 15 రోజుల కింద ఇంటినుంచి గెంటివేయగా భిక్షాటనతో జీవిస్తున్నానని జిల్లా సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సఖీ కేంద్రంలో ఆశ్రయం కల్పించగా శనివారం ఆర్డీవో మధుసూదన్ ఆదేశాల మేరకు ఆమె కుమారుడు, కోడలుకు ఏవో వరందన్, సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
కౌన్సిలింగ్ లో ఆ తల్లి తన పేరు మీద ఉన్న ఇల్లును ఆమె కోడలు మాయ మాటలు చెప్పి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని తనను పోషించక ఇంటి నుంచి గెంటివేయగా భిక్షాటన తో జగిత్యాల రామాలయం ప్రాంతంలో జీవిస్తున్నట్లు రోదిస్తూ చెప్పింది. ఆ కొడుకు, కోడలుకు వయోవృద్ధులను నిరాధరిస్తే 6 నెలల జైలు శిక్ష తో పాటు జరిమాన విదిస్తారని, కోడలు పేరిట మార్పిడీ చేయించుకున్నఇల్లును కలెక్టర్ తిరిగి అత్త పేరిట పట్టా జారీ చేస్తారని, ఏవో వరందన్, సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కౌన్సెలింగ్ ఇచ్చారు.
దీంతో స్పందించిన వారు ఆ తల్లిని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లావణ్య, ఎఫ్ఆర్వో కొండయ్య పాల్గొన్నారు.