Gambiraopet | గంభీరావుపేట, జనవరి 3: ఇద్దరు కవల పిల్లలకు జన్మ నిచ్చిన తల్లి తొమ్మిది రోజులకే ఆసుపత్రి లో మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీ రావు పేట మండలం లింగన్న పేట లో చోటు చేసుకున్నది. తమ్మనవేని సౌజన్య (23) పురిటి నొప్పులతో బాధపడుతు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి తీసుక పోయారు.
డిసెంబర్ 24 న ఉదయం వైద్యులు ఆపరేషన్ చేయడం తో ఇద్దరు ఆడ కవల పిల్లలకు సౌజన్య జన్మనిచ్చింది. తక్కువ బిపితో బాధపడుతున్న సౌజన్యను ఇక్కడి వైద్యులు పరీక్షలు చేసి కరీంనగర్ కు పంపించారు. 9 రోజుల తర్వాత జనవరి 2వ తేదీన శుక్రవారం రాత్రి సౌజన్య చికిత్స పొందుతూ మృతి చెందింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం తో తల్లి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.