తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో కరీంనగర్ జిల్లాలో క్రమేణా పచ్చదనం పెరిగింది. 2014 నుంచి ఏటా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, నేడు మానులుగా మారాయి. రోడ్లకు ఇరువైపులా, చెరువు గట్లు, గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో పెంచిన మొక్కలు ఎదిగివచ్చాయి. అన్నింటికన్నా మించి నాడు నామమాత్రంగానే ఉన్న అటవీ విస్తీర్ణం, నేడు చెప్పుకోదగ్గ స్థాయికి చేరింది.
కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 23 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన హరితహారం సత్ఫతాలనిచ్చిం ది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక య జ్ఞంలా కొనసాగించింది. ఏటా వానకాలం చిన్నపాటి వర్షాలు పడగానే.. మొక్కలు నాటించింది. అనంతరం సంరక్షణ చర్యలను అధికార యంత్రాంగం చూసుకునేది. దీంతో నాటిన మొక్కల్లో అత్యధిక శాతం వృక్షాలుగా మారాయి.
కరీంనగర్ జిల్లాలో తొమ్మిది విడుతల్లో 4.2 కోట్ల పైచిలుకు మొక్కలు నాటగా, ప్రస్తుతం 3.5 కోట్లకుపైగా బతికి ఏపుగా పెరిగాయి. ఫలితంగా ఉమ్మడిపాలనలో 8శాతానికే పరిమితమైన పచ్చదనం తాజాగా, 18.2 శాతానికి చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హరితహారానికి పెద్దపీట వే యడంతో ప్రతి పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేయ డం, అందులో పెరిగిన మొక్కలను గ్రామాల్లోని ఖాళీప్రదేశా ల నాటడం, ప్రతి ఇంటికీ పంపిణీ చేయడంతో మొక్కల పెం పకం మొదలైంది. ప్రజలు తమ ఇళ్లు, పెరళ్లలో పండ్లు, పూ ల మొక్కలు పెంచుకొనేలా ప్రోత్సహించడంతో పల్లెలు, పట్టణాలతోపాటు రహదారుల పక్కన ఆహ్లాదం వెల్లివిరుస్తున్నది.