Vemulawada | వేములవాడలో పగలే వెన్నెల.. పట్టణంలో పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలు
సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పండగ రెండు రోజుల క్రితమే ముగిసిన వీధుల్లో మాత్రం నిరంతరం విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి.
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో దుర్వినియోగమవుతున్న విద్యుత్
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 23 : సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు పండగ రెండు రోజుల క్రితమే ముగిసిన వీధుల్లో మాత్రం నిరంతరం విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో సద్దుల బతుకమ్మ దసరా సందర్భంగా వీధులలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మహాలక్ష్మి వీధిలోని జమ్మి చెట్టు వరకు స్వామివారి సేవ వెళ్లడంతోపాటు పట్టణవాసులందరూ జమ్మి చెట్టు వరకు వెళ్లి ప్రత్యేక పూజలు పాల్గొనే అవకాశం ఉంటుంది. గాంధీనగర్ మహాలక్ష్మి వీధి వరకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
పండగ మంగళవారం నాటికి ముగియగా శుక్రవారం నాటికి కూడా వీధి దీపాల విద్యుత్తును నియంత్రించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది ఇంతవరకు బాగానే ఉన్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విద్యుత్ దుర్వినియోగమవుతోంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లో నియంత్రణ ఉండగా వేములవాడ మున్సిపాలిటీలో మాత్రం పండగ పేరుతో ఏర్పాటు చేసిన వందలాది విద్యుత్ దీపాలు వెలుగుతూ విచ్చలవిడిగా విద్యుత్ ను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

