Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bellamkonda Sreenivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్లోనూ మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఆయన సినిమాలకు హిందీ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా భారీ ఆదరణ లభించేది. యూట్యూబ్‌లోనే కాకుండా నార్త్ ఇండియాలో టెలివిజన్, ఓటీటీ మార్కెట్లలోనూ ఆయన చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది.
Bellamkonda Sreenivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్లోనూ మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఆయన సినిమాలకు హిందీ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా భారీ ఆదరణ లభించేది. యూట్యూబ్‌లోనే కాకుండా నార్త్ ఇండియాలో టెలివిజన్, ఓటీటీ మార్కెట్లలోనూ ఆయన చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. దీంతో సినిమాల నిర్మాణ ఖర్చులో ఎక్కువ భాగం నాన్-థియేట్రికల్ హక్కుల విక్రయాల ద్వారానే రికవరీ అయ్యేది. అయితే మారుతున్న పరిస్థితులతో గత కొంతకాలంగా ఈ మార్కెట్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఓటీటీ సంస్థలు సినిమాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండటంతో పెద్ద హీరోల చిత్రాలకు సైతం డిజిటల్ హక్కుల విక్రయం సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’ నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గతంలో టాలీవుడ్ సినిమాలకు హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో మంచి ఆదాయం వచ్చేది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు నార్త్ ఇండియన్ ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని డబ్బింగ్ హక్కులకు భారీ మొత్తాలు చెల్లించేందుకు సంస్థలు ముందుకొచ్చేవి. అయితే ఇటీవల కాలంలో ఓటీటీ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి. కంటెంట్ నాణ్యత, హీరోల మార్కెట్, సినిమా విడుదల తేదీ, ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే డిజిటల్ సంస్థలు డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. కొన్ని సినిమాల విషయంలో విడుదలకు ముందు కాకుండా థియేట్రికల్ రిజల్ట్ వచ్చిన తర్వాతే హక్కులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
దీంతో నిర్మాతలకు నాన్-థియేట్రికల్ ఆదాయం విషయంలో కొంత అనిశ్చితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ‘హైందవ’ సినిమాకు వచ్చిన బిజినెస్ ఆఫర్ నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘హైందవ’ చిత్రానికి ప్రముఖ జీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను జీ సంస్థ సుమారు రూ.30 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓటీటీ, ఇతర నాన్-థియేట్రికల్ హక్కుల మార్కెట్ కొంత మందగించిన సమయంలో ఈ స్థాయి డీల్ కుదరడం విశేషంగా మారింది. దీనికి తోడు సినిమా ఆడియో హక్కుల రూపంలో మరో రూ.2 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాన్-థియేట్రికల్, ఆడియో హక్కుల రూపంలోనే విడుదలకు ముందే మొత్తం రూ.32 కోట్ల బిజినెస్ పూర్తయినట్లుగా సమాచారం. ఈ డీల్ నిజమైతే ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో ‘హైందవ’కు ఇది చెప్పుకోదగ్గ విజయమనే చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
AI Drones | దోమల భరతం పట్టే ఏఐ డ్రోన్లు.. గుజరాత్ కుర్రాళ్ల ఆవిష్కరణకు గేట్స్ ఫౌండేషన్ ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

