కరీంనగర్ కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 16: డిసెంబర్ 9లోగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి స్ప ష్టం చేశారు. లేదంటే పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమబాట పడుతామని హెచ్చరించారు. పీఆర్టీయూ తెలంగా ణ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు అయిలేని కరుణాక ర్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ, డీఏలు పెండింగ్ బిల్లులు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాటిచ్చి విస్మరించిందని మండిపడ్డారు.
అందులో సమయానికి జీతాలు తప్ప ఏ ఒక సమస్య నూ పూర్తిగా పరిషారం చేయలేకపోయిందని అసహ నం వ్యక్తం చేశారు. విరమణ పొందుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ఏండ్లకొద్ది పెం డింగ్‌లో పెట్టి తీవ్ర ఇబ్బంది పెడుతున్నదని దుయ్యబట్టారు. కొంతమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. డిసెంబర్9లోపు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే, కలిసివచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యమ కార్యాచరణ పీఆర్టీయూ ప్రకటిస్తున్నదని తెలిపారు.
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలోని సీనియర్లకే మండల విద్యాధికారులుగా ఇచ్చే ఉత్తర్వులు త్వరలో వస్తాయని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పదోన్నతి పొంది న ఉపాధ్యాయులను సత్కరించారు. ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, ఆడిట్ కమిట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మర్రి జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, జమీల్, దారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణరావు పాల్గొన్నారు.