చిగురుమామిడి, జూలై 10 : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో ఓటర్లతో భాగస్వామ్యమై వారి వివరాలు నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ సూచించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అధ్యక్షతన బీఆర్ఎస్ బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియను పరిశీలించాలని సూచించారు.
ఓటర్లకు బీఎల్వోలు అందించిన ఎన్యూమరేషన్ ఫామ్‌లో పూర్తి వివరాలు పొందుపరిచి తిరిగి ఇవ్వాలని చెప్పారు. లేకుంటే ఓటు హకు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఫారాలు ఎలా నింపాలో ఇప్పటికీ తెలియక ప్రజలు గందరగోళం చెందుతున్నారని, అనేకమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వారి ఫారం నింపడంలో బాధ్యతలు తీసుకుంటే దొంగ ఓట్లను నిర్మూలించే అవకాశం ఉందన్నారు. ప్రతి పది బూత్‌లకు ఒకరు చొప్పున పేర్లను ఎంపిక చేసి వారితో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎల్ఏల సందేహాలను నివృత్తి చేశారు. ఆన్లైన్లో వ్యక్తిగతంగా ఎలా నమోదు చేసుకోవాలో ట్రైనర్ గుండేటి శ్రీధర్ వివరించారు.
అనంతరం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మేరకు జనాభా సర్వే నడుస్తుందని, ఇది శుభ పరిణామమన్నారు. బూత్‌లలో ఓటర్లు చెప్పిన సమస్యలను బీఎల్ఏలు పరిషరించాలని సూచించారు. బీఎల్వోల వద్ద నుంచి రసీదు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సర్పంచులు బోయిని రమేశ్, ఒంటెల కిషన్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఆకవరం శివప్రసాద్, కత్తుల రమేశ్, ఎస్కే సిరాజ్, గిట్ల తిరుపతిరెడ్డి, నాగెల్లి రాజిరెడ్డి, పిల్లి వేణు, సన్నీళ్ల మల్లేశ్, పరిపాటి రవీందర్‌రెడ్డి, శ్యామకూర సంపత్‌రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.