మేడిపల్లి, మే 4: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో పర్యటించారు. మాజీ వైస్‌ఎంపీపీ దొనకంటి వేణుగోపాల్‌రావు అల్లుడు ఎన్నమనేని సృజన్‌రావు గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో ఆదివారం సృజన్‌రావు సంవత్సరీక కార్యక్రమం నిర్వహించగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. సృజన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు.
అనంతరం సృజన్‌రావు భార్య ఎన్నమనేని ప్రణవిరావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత సురేశ్ దంపతులు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ సర్పంచులు ద్యావనపెల్లి అభిలాశ్, ఈర్నాల సంపత్‌కుమార్, నాంచారి రాజేందర్, నాయకులు అంకం విజయసాగర్, దురిశెట్టి లక్ష్మణ్‌కుమార్ ఉన్నారు.