MLC Kavitha | కోరుట్ల, జూన్ 7: కథలాపూర్ మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై నాగం భూమయ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భూమయ్య కుటుంబసభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, జాగృతి నాయకులు పాల్గొన్నారు.