ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. ఇక్కడ ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్న భానుప్రసాద్, ఎల్.రమణ ఇద్దరూ గెలుపొందారు. ఇక్కడ మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లనివి కాగా, 1303 చెల్లుబాటు అయ్యాయి.
భానుప్రసాద్‌కు 584 ఓట్లు రాగా, రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించినట్లయింది.