MLA, Vijayaramana Rao | సుల్తానాబాద్ రూరల్, జులై 23: సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, రాముని పల్లి, మంచ రామి గ్రామాల్లో పెద్దపెల్లి ఎమ్మెల్యే బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ముగ్గురు పోసి మంజూరు పత్రాలను అందజేశారు. కనుకుల గ్రామంలో ఇల్లందుల శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.
గ్రామాల్లో పలు సీసీ రోడ్ల , డ్రైనేజీల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు.