కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే సమక్షంలోనే బహిర్గతమయ్యాయి. సోమవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇద్దరు కౌన్సిలర్లు పరస్పరం తోసుకోగా, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గొడవ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వెళ్లిపోగా, చివరకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. హస్తం నేతల తీరుపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గొడవల సంస్కృతి మొదలైందని చర్చికుంటున్నారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి19 : పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సోమవారం రెండు ట్రాక్టర్లను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే విజయరమణారావు వచ్చారు. కొబ్బరి కాయలు కొట్టే క్రమంలో కౌన్సిలర్లు నూగిళ్ల మల్లయ్య, కొలిపాక శ్రీనివాస్ మధ్య తోపులాట జరిగిం ది. ఎమ్మెల్యే పక్కనున్న శ్రీనివాస్‌ను పక్కకు జరుగాలని మల్లయ్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. పోలీసులు అదు పు చేయడంతో ఎమ్మెల్యే ట్రాక్టర్లను ప్రారంభించా రు. అనంతరం పెద్దపల్లి బల్దియా 2024 -25 బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నా రు. తొలిసారిగా మున్సిపల్‌కు వచ్చిన ఎమ్మెల్యేను కౌన్సిలర్లు శాలువాలతో సన్మానిస్తున్న క్రమం లో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎందుకు ముందు పిలుస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్‌ను కౌన్సిలర్ శ్రీనివాస్ ప్రశ్నించారు.
అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ తమ వార్డులో పనులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశం జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు కౌన్సిలర్లకు సంబంధించి అనుచరులు మున్సిపల్ కా ర్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లా డి వెళ్లిపోయే క్రమంలో కొంత మంది లోపలికి వెళ్లి కొట్టుకున్నారు.ఎమ్మెల్యేతోపాటు శ్రీనివాస్ బయటికి వచ్చారు. మల్లయ్య అనుచరులు దాడి చేశారని ఆరోపించారు.
ఎన్నికల్లో విజయరమణారావు గెలుపు కోసం తాము పని చేశామని, ముదిరాజ్‌లను మున్నూరుకాపులు అణగదొక్కుతున్నారనిఎమ్మెల్యేకు చెప్పా రు. అయితే గొడవ జరుగుతుండగానే ఎమ్మె ల్యే వావాహం ఎక్కి వెళ్లిపోయారు. అనంత రం ఇరువర్గాల అనుచరులు దాడులకు పాల్పడగా, సీఐ కృష్ణ ఎస్ఐ లక్ష్మణ్‌రావు, మల్లేశ్, పోలీసులు చెదరగొట్టారు. శ్రీనివాస్‌తోపాటు ఆయన అనుచరులను మున్సిపల్ కార్యాల యం నుంచి బయటికి వెళ్లగొట్టి గేటు పెట్టారు. గేటు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. అనంతరం శ్రీనివాస్, మల్లయ్య ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.