బోయినపల్లి, జూలై 17: కాంగ్రెస్ హా యాంలో కనీసం నారుమడికి నీరందిందా..? రైతులకు ఒరగబెట్టింది ఏంటి..? అంటూ చొ ప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. సాగుకు మూడు గంటల కరెంట్ చా లన్న రేవంత్‌రెడ్డికి బుద్ధిచెప్పాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. సోమవారం బోయినపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఉచిత కరెంట్‌పై అనుచిత వ్యాఖ్య లు చేసిన రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీసీసీ చీఫ్ సాగుకు 3 గంటల కరెంట్ చాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఉచి త కరెంట్ అవసరం లేదని మాట్లాడుతూ రై తాంగానికి అన్యాయం చేసేందుకు కుట్రలు చే స్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ పా లిత రాష్ర్టాల్లో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏంటో చెప్పాలని డి మాండ్ చేశారు. ఉమ్మడి పాలనలో సాగునీటి కోసం ఒక్కో రైతు 20 బోర్లు వేసి నష్టపోయేవారని, కానీ ఇప్పుడు సీఎం కాళేశ్వరం నిర్మించి సాగుకు సరిపడా నీరందిస్తుండడంతో బోర్లు వే సే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాట లు నమ్మితే నట్టేట మునగడం ఖాయమని హె చ్చరించారు. అన్నదాతలు మూడు గంటలు చా లన్న కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ సర్కారును ఆదరించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కొనుకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, స ర్పంచ్‌లు చిందం రమేశ్, ఒంటెల గోపాల్ రెడ్డి, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, కన్నం మధు, కోరేపు నరేశ్, ఎంపీటీసీలు ఐరెడ్డి గీతా, అక్కెనపల్లి ఉపేందర్, నాయకులు సత్తినేని మాధువు, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్, కం కణాల పురుషోత్తంరెడ్డి, ఆరేపల్లి రాజు, నిమ్మ శ్రీనివాసరెడ్డి, కవంపల్లి రా ములు, భీమనాథుని ర మేశ్, ఎడపల్లి బాబు, కొప్పుల మల్లెశం, రవి, మాధవరెడ్డి, శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు.