కొడిమ్యాల, ఆగస్టు 28: ‘జేపీ నడ్డా..ఇది కేసీఆర్ అడ్డా.. తెలంగాణ గడ్డపై నీ ఆటలు సాగవు బిడ్డా’ అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు సృష్టించి పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను ఊసిగొల్పుతూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలగొడుతూ ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఎమ్మెల్యే కొడిమ్యాలలో పర్యటించారు. 167 మంది ఆసరా కొత్త లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, ఐడీ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సమైక్య పాలనలో రూ. 200 ఇస్తున్న పింఛన్‌ను పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అలాగే అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
కొడిమ్యాల మండలానికి పింఛన్ల రూపంలో ప్రతినెలా రూ.2 కోట్ల 13 లక్షల 84 వేలను పంపిణీ చేస్తునట్లు చెప్పారు. మండల అభివృద్ధికి విరివిగా నిధులు మంజూరు చేయించానని పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, ఎంపీడీవో పద్మజ, ఎంపీవో గంగాధర్. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగరావు, పొలు రాజేందర్, బండ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఎంపీటీసీలు మల్లారెడ్డి, సింధు, మరియా, మహేశ్. లక్ష్మణ్, సర్పంచ్‌లు మ్యాకల లత, పెద్ది కవిత, అంబటి లత, ఏగుర్ల తిరుపతి, మల్యాల అనిత, సయ్యద్ హైదర్, గరిగంటి మల్లేశం, గుంటి లక్ష్మీదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, ఆర్బీఎస్ మండల కో అర్డినేటర్ అంకం రాజేశం, నాయకులు బోడ్డు రమేశ్, అంబటి తిరుమలేశ్, పెద్ది రవికుమార్, గంగుల మల్లేశం, గడ్డం లక్ష్మారెడ్డి, బండపల్లి అంజన్‌కుమార్, రోడ్డ శరత్, నేరేళ్ల మహేశ్, మాంకాళి గంగరాజం, లింగంపల్లి నరేందర్, కాయిత రాజు, బోలుమాల్ల గంగరాజం, బండి రాజేందర్, ఉన్నారు.