వీణవంక, ఏప్రిల్ 22: తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేం ద్రంలో మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యూరియా మాదిరిగా ట్రాక్టర్లకు కూడా జీపీఎస్ యాప్ తీసుకువచ్చే ఆలోచనలో ప్రభు త్వం ఉందని, ఆ ఆలోచనను విరమించుకోవాలని కోరారు.
ట్రాన్స్‌పోర్టు ద్వారా మిల్లర్లకు వచ్చే డబ్బులను రైతులకు చెల్లించాలని తెలిపారు. డంపింగ్‌యార్డును రద్దు చేయాలని హుజూరాబాద్‌లో నిరసన కార్యక్రమా లు జరుగుతున్నాయని చెప్పారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోతిరెడ్డిపేట నుంచి ప్రారంభించనున్న పాదయాత్ర కు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, వీణవంక సర్పంచ్ దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ మహేశ్‌గౌడ్, తహసీల్దార్ రాజమల్లు, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్, ఏవో గణేశ్, ఏపీఎం సుధాకర్, జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ సునీ ల్, తదితరులు పాల్గొన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఇల్లందకుంట ఏప్రిల్ 22: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం మర్రివాణిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రంలో రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఇక్కడ సర్పంచ్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఐకేపీ ఎంపీఎం రాచపల్లి స్వామి, తదితరులు ఉన్నారు.