ఇల్లందకుంట/జమ్మికుంట, నవంబర్ 6: ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూసిస్తానని, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం మండలంలోని వాగొడ్డురామన్నపల్లి, పాతర్లపల్లి, సిరిసేడు గ్రామాల్లో, జమ్మికుంటలోని 3,12,23,24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌశిక్‌రెడ్డికి నాయకులు, ప్రజలు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతుల పంట పెట్టుబడి కోసం 19వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. రుణమాఫీ కాని రైతులకు త్వరలో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు.
మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటింటీకీ నల్ల నీరు ఇస్తునట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాల్వల ద్వారా పంటలకు సాగు నీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాడానికి దళితబంధు పథకం ప్రవేశపెట్టామని, రెండో విడుత దళితబంధు రాని వారికి త్వరలో డబ్బు వేస్తామని పేర్కొన్నారు.
రైతులకు రైతుబంధు తరహాలోనే పేదలకు రైతు బీమా వాటి పథకాలను ఇస్తున్నట్లు చెప్పారు. ఏడు సార్లు ఈటల రాజేందర్‌ను గెలిపించారని, ఈ ఒక్కసారి తనను గెలిపించాలని అభ్యర్థించారు. జమ్మికుంటను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ప్రచారంలోశాలినీరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కౌన్సిలర్లు రవీందర్, మల్లయ్య, నాయకులు దిలీప్, సదానందం, మాణిక్యం, సర్పంచులు పుట్ట రాజు, రాంమల్లయ్య, ఎంపీపీ పావని వెంకటేశ్, ఎంసీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, చిన్నరాయుడు, మాజీ వైస్ ఎంపీపీ చుక్క రజింత్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ సర్పంచు బుర్ర రమేశ్, బీఆర్ఎస్ నాయకులు కుమార్, ముస్తాఫ, మొండయ్య, శ్రీకాంత్, కృష్ణ, ప్రమోద్, మురళి, తదితరులు పాల్గొన్నారు.