బోయినపల్లి, డిసెంబర్ 28: దళారులు, పైరవీకారులకు చోటులేదని, అర్హులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గురువా రం బోయినపల్లి, బూర్గుపల్లి, కోరెం గ్రామా ల్లో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బోయినపల్లి, కోరెం గ్రా మాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేయగా, కార్యకర్తలు ఘన స్వాగతం పలికా రు.
అనంతరం బోయినపల్లిలో ఆర్టీసీ బస్సు ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నల్ల రాజేందర్‌రె డ్డి, ఎంపీవో గంగాతిలక్, ఏపీవో సబిత, స ర్పంచులు లతశ్రీ, లచ్చయ్య, రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ బుచ్చమ్మ, మాజీ జడ్పీటీసీ లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు రవి, నాయకులు రమణారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి ఉన్నా రు. అలాగే, బోయినపల్లి జడ్పీ పాఠశాలలో చెన్నాడి మార్తాండరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడలను ప్రారంభించారు. ఇక్క డ బీఆర్ఎస్ నాయకుడు జోగినపల్లి ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీపీ వేణుగోపాల్, ట్రస్టు చైర్మన్ చెన్నాడి రాజ్యలక్ష్మి, సర్పంచ్ గుంటి లతశ్రీ, ఎంపీటీసీ బుచ్చమ్మ, మాజీ ఎంపీపీ భాగ్యలత, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ లక్ష్మీపతిలున్నారు.