బోయినపల్లి, జనవరి 5: ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసేందుకే ప్రజాపాల న నిర్వహిస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం అన్నారు. శుక్రవారం బో యినపల్లి మండలం గుండన్నపల్లిలో నిర్వహించిన ప్రజా పా లన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధం గా ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర మహిళల కళ్లల్లో సంతోషాన్ని చూడడానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేశారన్నారు.
మిగిలిన నాలుగు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. వంద శాతం ప్రజలకు ప్రజాపాలన ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపీపీ వేణుగోపాల్, ఎంపీటీసీ ఉపేందర్, ఉపసర్పంచ్ ఐలయ్య, జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో రాజేందర్ రెడ్డి , ప్రణీత, వన్నెల రమణారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.