అంతర్గాం, జూలై 17: ‘కాంగ్రెస్ అంటేనే కటిక చీకటి. వారి పాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ షాక్‌తో మరణాలు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ అంటే 3 పంటలు. 24 గంటల కరెంట్’ అని వ్యాఖ్యానించారు. సోమవారం అంతర్గాం మండలం సోమన్‌పల్లి రైతు వేదిక వద్ద రైతు సభ నిర్వహించారు. అంతకుముందు అంతర్గాం ఎంపీడీవో కార్యాలయం నుంచి రైతు వేదిక వరకు ట్రాక్టర్ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముందుకుసాగారు. ఆయనకు రైతు వేదిక వద్ద రైతులు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. రైతులందరూ 24 గంటల కరెంట్ కావాలని, రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని తీర్మానం చేశారు.
అనంతరం జరిగిన రైతు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘నాడు ఉమ్మడి పాలనలో చంద్రబాబు వ్యవసాయాన్ని దండుగ అన్నాడని, ఇప్పుడు ఆయన వారసుడు రేవంత్‌రెడ్డి సాగుకు 3 గంటల కరెంట్ చాలని చెబుతున్నాడని’ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం రైతులు అరిగోస పడ్డారని, ఎప్పుడు వస్తుందో తెలిసేదికాదన్నారు. రాత్రివేళల్లో రైతులు పొలాలకు వెళ్లి పాముకాటుతో మరణించే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ సర్కా రు రైతులకు సరిపడా కరెంట్, సాగునీరు, ఎరువులు అందిస్తున్నదని చెప్పారు. పెట్టుబడి కోసం రైతుబంధు ఇస్తున్నదని పేర్కొన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో రైతుల కోసం అలోచన చేసిన నాయకుడే లేడని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేనివిధంగా రైతు సంక్షేమ పథకాలను అమ లు చేస్తున్నారని చెప్పారు. 24 గంటల ఫ్రీ కరెంట్, రైతుబంధు, రైతుబీమా, ఎరువుల పంపిణీ లాంటి పథకాలు అమలు చేస్తూ రైతును రాజుగా చేశారని కొనియాడారు.
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని, మేలు చేస్తున్న కేసీఆర్ సర్కారుకు అం డగా నిలువాలని రైతులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్‌రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్‌పాషా, సర్పంచులు కోల్లురి సత్య సతీశ్, ధరణి రాజేశ్, దేవమ్మ రాము లు, మెరుగు పోశం, బండారి ప్రవీణ్, గుముమ్మల రవీందర్, బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ. కోల ల త, చందయ్య, మల్లెత్తుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతినాయక్, ఎదులపూరం వెంకటేశ్, కుర్ర నూకరాజు, గీట్ల శంకర్‌రెడ్డి, మదన్మెహన్రావు, కొమురయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.