మెట్పల్లి, ఏప్రిల్ 28: ‘అకాల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. ప్రతి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తాం’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ నుం స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. నువ్వు, మామి డి, వరి, తదితర పంటలు చేతికందే సమయంలో దెబ్బతినడం బాధాకరమన్నారు. సర్కారు ఆదేశాల మేరకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను క్షేత్రస్థాయికి పంపించి నష్టం వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతల మేలుకోరి మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలుకు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు కోరు ట్ల నియోజకవర్గంలో మండలానికొకటి చొప్పున నాలుగు సెంటర్లు మంజూరయ్యాయని తెలిపారు. మద్దతు ధర ఇచ్చి కొంటామని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.