కార్పొరేషన్, జనవరి 31: ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకుల దాకా ప్రజాప్రతినిధుల మధ్య అనుబంధాన్ని పెంచడం, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 5న కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్‌లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్లో నిర్వహించే ఈ సమావేశానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు.
ఈ మేరకు బుధవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నాయకులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, జమీలుద్దీన్, కాసరపు శ్రీనివాస్ గౌడ్, పిట్టల రవీందర్, పిల్లి మహేశ్, సుంకిశాల సంపత్ రావు, జువ్వాడి రాజేశ్వర్ రావు ఉన్నారు.